Home / Inspiring Stories / స్విమ్మింగ్ లో 50 గోల్డ్ మెడల్స్ సాధించిన చేతితో ఇప్పుడు కార్లని తుడుస్తున్నాడు.

స్విమ్మింగ్ లో 50 గోల్డ్ మెడల్స్ సాధించిన చేతితో ఇప్పుడు కార్లని తుడుస్తున్నాడు.

Author:

ఢిల్లీకి దగ్గరగా ఉండే ఘజియాబాద్ లో వైశాలి అనే ప్రాంతంలో అంత్యంత పేద కుటుంబంలో భరత్ కుమార్ జన్మించాడు, పుట్టడంమే ఒక చేయి లేకుండా పుట్టిన భరత్ కుమార్ బ్రతకటానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది, భరత్ తల్లిదండ్రులు రోజు కూలి పని చేస్తేనే వారికి తిండి దొరుకుతుంది, భరత్ కుమార్ ఒక చేయి లేకపోవడం వల్ల పని చేసే ఆవకాశం ఎవ్వరు ఇవ్వలేదు, తమకు ఉన్న గేదెలను రోజు పొలం గట్లకి తీసుకెళ్ళేవాడు, గేదెలు కాలువలో ఈత కొడుతుంటే వాటిని పట్టుకొని ఈత కొట్టడం నేర్చుకున్నాడు, అలా ఈత బాగా నేర్చుకొని ఈత పోటీలలో పాల్గొనటం మొదలుపెట్టాడు, 2004లో ఢిల్లీలో జరిగిన ఈత పోటీలలో పాల్గొని గెలిచాడు,అలా ఎంతో కష్టపడి దేశ విదేశాలలో జరిగిన స్విమ్మింగ్ పోటీలలో పాల్గొన్నాడు, ఇప్పటివరకు దేశ విదేశాల స్థాయిలో 50 గోల్డ్ మెడల్స్ దాకా సాధించాడు, అంతర్జాతీయంగా జరిగే స్విమ్మింగ్ పోటీలలో మనదేశం నుండి ఎంపికై 2 మెడల్స్ కూడా సాధించాడు.

స్విమ్మింగ్ లో 50 గోల్డ్ మెడల్స్ సాధించిన చేతితో ఇప్పుడు కార్లని తుడుస్తున్నాడు.

ఇలా ఎన్నో మెడల్స్ సాధించిన భరత్ కుమార్ ఇప్పుడు కార్లని తుడుచుకుంటూ బతుకుతున్నాడు, తినడానికి కూడా తిండి లేని పరిస్థితులలో ఉన్న భరత్ కుమార్ ని ఏ ప్రభుత్వం కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ సెలబ్రెటీ కానీ ఆదుకోలేదు, ఇన్ని రోజులు స్నేహితులు, బంధువులు, తెలిసిన వారు సహాయం చేయబట్టి ఇన్ని పతకాలు గెలిచాడు, కానీ ఇప్పుడు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేరు అందుకే తాను కూడా ఏదైనా పనిచేసి కుటుంబానికి సహాయంగా ఉండాలనుకున్నాడు, కానీ ఏ ఉద్యోగానికి వెళ్లిన అతనిని పై నుండి కింది వరకు చూసి బయటకు వెళ్లామన్నారు కానీ ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు, ఎన్ని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగిన, రాజకీయ నాయకులని కలిసిన ఎవ్వరు ఆదుకోలేదు, భరత్ కుమార్ పోటీలలో పాల్గొనడానికి ప్రాక్టీస్ చేయాలంటే నెలకి దాదాపు 20 వేల దాక అవుతాయి అంత భారం భరించే స్థోమత భరత్ కుటుంబానికి లేదు, అందుకే కుటుంబానికి భారం కాకుండా కార్ సర్వీసింగ్ సెంటర్ లో కార్లని తుడిచే పని చేస్తూ బతుకుతున్నాడు. ఎప్పటికైనా ప్రభుత్వం భరత్ కుమార్ విజయాల్ని గుర్తించి ఆదుకోవాలి, మీలో ఎవరైనా భరత్ కుమార్ ఆర్థికంగా ఆదుకోవాలంటే 9811829212 నెంబర్ కి ఫోన్ చేసి ఆదుకోవచ్చు.

స్విమ్మింగ్ లో 50 గోల్డ్ మెడల్స్ సాధించిన చేతితో ఇప్పుడు కార్లని తుడుస్తున్నాడు.

118 మందితో ఒలంపిక్స్ కి వెళ్లిన మన దేశ క్రీడాకారుల బృందం రెండు పతకాలతో తిరిగొచ్చింది, ప్రపంచంలో జనాభా విషయంలో రెండో స్థానంలో ఉన్న మనం ఒలంపిక్స్ పతకాల పట్టికలో మాత్రం 67 వ స్థానంలో ఉన్నాం, 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా మాత్రం అగ్ర స్థానంలో ఉంది. వాళ్ళకి మనకి ఉన్న తేడా ప్రభుత్వ ప్రోత్సహం, అక్కడి వాళ్ళకి ప్రభుత్వమే అన్ని రకాలుగా కోచింగ్ ఇప్పిస్తుంది, మన దేశంలో మాత్రంలో అలాంటి పరిస్థితి ఉండదు, ఒలంపిక్స్ లో అద్భుత ప్రదర్శన చేసిన దీప కర్మాకర్ కి ప్రాక్టీస్ చేయడానికి కూడా సరైన సదుపాయాలు లేవు, తన ప్రతిభ ముందే గుర్తించి మంచి సదుపాయాలు కల్పిస్తే దీప కర్మాకర్ రూపంలో మనకి మరో పతకమొచ్చేది, అలా మనదేశంలో చాలా మంది క్రీడాకారులు ప్రతిభ ఉన్న సరైన కోచింగ్, సదుపాయాలు లేకపోవడం వల్ల పతాకాలని సాధించలేకపోతున్నారు, ఎవరైనా ఒలంపిక్స్ లో పతకం సాధిస్తే కోట్ల రూపాయలని కురిపించే ప్రభుత్వాలు ముందే నుండే ఒలంపిక్స్ లి గెలవగలిగే క్రీడాకారులని గుర్తించి వారికి సరైన సదుపాయాలు కల్పిస్తే మనం కూడా ఎక్కువ పతకాలు సంపాదించవచ్చు.

ఇప్పుడు బాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధు కూడా పుల్లెంల గోపీచంద్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించే ప్రైవేట్ అకాడమీ నుండే వచ్చింది, కావున మన ప్రభుత్వాలు ఎప్పటికైనా కళ్లుతెరిచి మన దేశంలో ఉన్నది క్రికెట్ ఒక్కటే కాదు చాలా ఉన్నాయని తెలుసుకొని ప్రతిభ ఉన్న వారిని అవీనితికి తావులేకుండా నీజాయితిగా గుర్తించి ప్రోత్సహిస్తే ఇలా భరత్ కుమార్ లాగ కాకుండా ఉంటారు.

Must Read: వరల్డ్ ఛాంపియన్ ని చంపేసిన ప్రభుత్వం.

(Visited 1,190 times, 1 visits today)