Home / Videos / పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానిని..కొడతావా అని అడగొద్దు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానిని..కొడతావా అని అడగొద్దు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానిని. కొడతావా అని అడగొద్దు…..ఎంతసేపు కొడతావన్నా అని అడుగు…ఇదీ హీరో సాయి ధరం తేజ్ పంచ్…. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. రేపు సినిమా విడుదలకు ముందస్తు సన్నాహంగా ఈ ట్రైలర్ విడుదలైంది. సినిమా నిర్మాత దిల్ రాజు కొద్దిసేపటి క్రితమే తన ఫేస్ బుక్ పేజ్ లో ఈ ట్రైలర్ విడుదలకు సంబంధించిన పోస్టింగ్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన హరీష్ శంకర్ దర్శకుడి గా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న భారీ కమర్షియల్ ఎంటర్టైనర్, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’.

‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రం లో హీరో కారెక్టరైజేషన్ హైలైట్ గా ఉంటుంది అని, సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో నే ఒక మైలురాయి గా నిలిచే చిత్రం అవుతుంది అని దర్శకులు హరీష్ శంకర్ చెప్పినట్టే, మంచి పంచ్ డైలాగ్ తో ట్రైలర్ ని ఈ రోజు దిల్ రాజు విడుదల చేశారు.

“ప్రెక్షకులను, మెగా ఫ్యామిలీ అభిమానులను అలరించటానికి, మెగాస్టార్ చిరంజీవి గారి పాటను రీమిక్స్ చేశాం. ఇది ఈ చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది ” అని నిర్మాత దిల్ రాజు అన్నారు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చే చిత్రాలకు ఉండే ఉన్నతమైన సాంకేతిక విలువలు, హరీష్ శంకర్ రాసే పదునైన సంభాషణలు, సాయి ధరం తేజ్ అధ్బుతమైన డాన్స్ ,నటన, రెజినా గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు గా నిలుస్తాయి అని చిత్ర బృందం చెబుతోంది. అమెరికా లో 35 రోజుల పాటు ఎన్నో అందమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం.      Also Read: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా రివ్యూ.

సాయి ధరమ్ తేజ్, రెజినా , నాగబాబు, కోటా శ్రీనివాస రావు, పృథ్వి, రావు రమేష్ తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు.

 

(Visited 141 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]