చిరంజీవి పెద్ద కొడుకును నేనేనంటూ సుజిత్ అలియాస్ రవీందర్ అనే యువకుడు సంచలనానికి తెరతీశాడు. చిరంజీవికి తానే పెద్ద కొడుకునని కావాలంటే డీఎన్‌ఏ టెస్టులు చేసుకోవాలంటూ శుక్రవారం హెచ్‌ఆర్సీని ఆశ్రయించాడు. చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో తాను నటించానంటూ చెబుతున్నాడు. అయితే…ఇదంతా బోగస్ అంటూ మెగా అభిమానులు కొట్టిపారేశారు. పసివాడి ప్రాణంలో చిరంజీవి కొడుకుగా నటించింది అమ్మాయని వారు వివరణ ఇచ్చారు. 28 ఏళ్ల కిందట సినిమా రాగా..కొడుకునంటూ ఇప్పుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చిరంజీవి అభిమానులు మండిపడ్డారు. ప్రచారం కోసమే రవీందర్ డ్రామా ఆడుతున్నారని మెగా అభిమానుల విమర్శించారు. రవీందర్‌కు మతిభ్రమించిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:త్రిపుర సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.