Home / Inspiring Stories / దీపావళి పండక్కి బోనస్ గా తన ఉద్యోగులకి 1260 కార్లు, 400 ఫ్లాట్లు ఇచ్చిన సూరత్ వ్యాపారి.

దీపావళి పండక్కి బోనస్ గా తన ఉద్యోగులకి 1260 కార్లు, 400 ఫ్లాట్లు ఇచ్చిన సూరత్ వ్యాపారి.

Author:

ఒక కంపెనీ యజమాని తన సంస్థలో పని చేసే ఉద్యోగులను తన సొంతవారీగా చూసుకుంటే, ఉద్యోగులు కూడా ఆ సంస్థను తమ సొంతగా భావించి ఆ సంస్థ ఉన్నతికి ఎంతో కష్టపడి పనిచేస్తారు.ఇదే సూత్రాన్ని పాటించి తన మామయ్యా దగ్గర అప్పుగా కొంత డబ్బును తీసుకోని వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు ఎన్నో కోట్లు సంపాదించాడు సూరత్ కి చెందిన వజ్రాల వ్యాపారి సావ్ జీ ధోలాకియా.

gujarath-daimonds-business-man

ప్రతి సంవత్సరం తన సంస్థలో పని చేసే ఉద్యోగులకు భారీ కానుకలు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు ఈ వ్యాపారి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం దీపావళికి బాగా పని చేసే ఉద్యోగులకు 1260 కార్లు, 400 ఫ్లాట్లు కానుకగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. “హరే కృష్ణ ఎక్స్ పోర్ట్స్” పేరుతొ వజ్రాల వ్యాపారం చేసే ధోలాకియా తన సంస్థలలో బాగా పనిచేసే 1716 మందిని గుర్తించి వారికి 11oo చదరపు అడుగుల ఇంటికి( దీని ధర 15 లక్షలు ఉంటుంది) అలాగే కారుకు మొదటి 5 సంవత్సరాలు 5 వేల ఈఎంఐ లను కంపెనీ భరిస్తుంది అని, మిగిలిన మొత్తం ఈఎంఐ ఇంటికి 11 వేలు, కారు ధరను బట్టి ఉద్యోగి కట్టుకునే విధంగా వెసులుబాటు కలిగించారు. అంటే ఇల్లు కొనుక్కునే ఉద్యోగికి మూడు లక్షలు ఉచితంగా సహాయం చేస్తున్నాడు.

పోయిన సంవత్సరం 491 కార్లు, 200 ఫ్లాట్లు గిఫ్ట్ గా ఇచ్చిన ఈ వ్యాపారి అంతకు ముందు సంవత్సరం 50 కోట్లు పండగ బోనస్ గా ఉద్యోగులకు ప్రేమతో పంచి పెట్టాడు. ధోలాకియా తనకు వ్యాపారంలో వచ్చిన లాభాలతో ఎన్నో సేవ కార్యక్రమాలను చేస్తున్నాడు. అందులో ముఖ్యంగా పేద ఇంటి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి వారికి అవసరమైన బంగారం, ఇంటి సామాన్లు అన్ని ఇతడే భరిస్తున్నాడు. వేలల్లో ముసలివారికి నెలనెలా ఫించన్ రూపంలో డబ్బును ఇస్తున్నాడు. పేదవారికి అందుబాటులో చాలా ఆసుపత్రులను కట్టించాడు.

ఆ మధ్య పత్రికలలో, టీవీలలో మారుమోగిన వార్తా .. ఒక కోటీశ్వరుడు తన కొడుక్కి డబ్బు విలువ తెలియాలని ఖర్చులకు చాల తక్కువ మొత్తంలో ఇచ్చి చిన్న, చిన్న ఉద్యోగాలు చేయమని చెప్పి ఇంట్లో నుండి పంపించిన సంగతి తెలిసిందే కదా! నెల రోజుల పాటు తానూ ఎవరి కొడుకునో చెప్పకుండా, తన చదువుకు సంబంధం లేకుండా పని చేయాలనీ చెప్పి, ఇంత వరకు తెలియని ఒక ప్రాంతంలో పనిచేయాలని పంపించన వార్తా చాలా మందికి తెలుసు కదా! అతనే మన ధోలాకియా. తన కొడుకుకి డబ్బు విలువ, కష్టం విలువ, మనుషుల విలువ తెలియాలనే ఉన్నతమైన ఆలోచనతో అలా చేసాడు.

Must Read:  6 వేలకోట్ల ఆస్తిని వదిలేసి కొడుకుని బేకరీలో పనిచేయమన్న తండ్రి..! అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

(Visited 2,744 times, 1 visits today)