Home / health / యువత పొగ ఇంతలా ఎందుకు పీలుస్తుందో తెలుసా?

యువత పొగ ఇంతలా ఎందుకు పీలుస్తుందో తెలుసా?

Author:

ఈ రోజుల్లో యువత విచ్చలవిడిగా ఎక్కడ పడితే స్మోకింగ్ చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఆరోగ్యానికి హానికరం… అని ఎంతగా ప్రచారం చేస్తున్నా పొగరాయుళ్లు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. చాలా నగరాల్లో పొగరాయుళ్లలో ఎక్కువ శాతం మంది యువతే. ఆడా, మగా తేడా లేకుండా పీల్చేస్తున్నారు. ముంబైలో అసలు యువత ఎందుకు స్మోకింగ్ కు అలవాటు పడుతోందో తెలుసుకోవడం కోసం ఓ హాస్పిటల్ వారు సర్వే నిర్వహించారు.

అందులో చాలా ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. దాదాపు 21 శాతం మంది పొగ తాగుతూ ఫోజ్ కొడితే చాలా కూల్‌గా కనిపిస్తామని అందుకే తాగుతున్నామని చెప్పారు. ఇక 17శాతం మంది మాత్రం ఒత్తిడి నుంచి తట్టుకునేందుకే పొగ తాగుతున్నామని చెప్పారు.

survey-revealed-reasons-for-smoking

ముంబైలో 1500 మంది విద్యార్థులపై ఈ సర్వే జరిగింది. వారిలో 700 మంది అబ్బాయిలు, 800 మంది అమ్మాయిలు పాల్గొన్నారు.ప్రశ్నాపత్రంలో ఎందుకు స్మోక్ చేస్తారు? కారణాలేంటీ? ఎలా అలవాటైంది? స్మోకింగ్ ఎంత ప్రమాదకరమో తెలుసా? మొదలగు ప్రశ్నలు పొందుపరిఛి, వారందరికీ పరీక్ష పెట్టారు. వాటికి యువత ఇచ్చిన జవాబులను బట్టి ఫలితాలను అంచనా వేశారు. ఇందులో వింతైన విషయం ఏంటంటే… యువతలో 59శాతం మంది స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమన్న సంగతి తెలుసని చెప్పారు. వారిలో 16 శాతం మంది కేవలం వినోదం కోసమే పొగతాగుతామని చెప్పగా, 17 శాతం మంది ఒత్తిడి తగ్గించుకోవడం కోసమని, 21 శాతం మంది కూల్ గా కనిపించడం కోసమని చెప్పారు. వీరిలో 14 శాతం మంది మాత్రమే రోజులో ఒక్కసారి స్మోక్ చేస్తారు. మిగతా వారంత అంతకంటే ఎక్కువ చేసేవారే.

Must Read: ఇంటర్నెట్ లో అల్లు అర్జున్-స్నేహ ల డాన్స్ వీడియో హల్ చల్.

(Visited 607 times, 1 visits today)