Home / Inspiring Stories / ఈ ఐఏఎస్ తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం.

ఈ ఐఏఎస్ తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం.

Author:

Chandrakala IAS

‘మీరు చేసే పని ఇదేనా? మీరు జైలుకు వెళ్లడం ఖాయం. మీలో కొద్దిగైనా నైతికత అనేది ఉందా? ప్రజాధనం ఎలా వృథా చేస్తారు? మీరు సిగ్గుతో తలదించుకోవాలి’ ఈ మాటలు ఏవరో ఫేస్ బుక్ లో పెట్టిన పొస్ట్ కాదు. అవినీతి కాంట్రక్టర్ల మొహం మీదే ఒక మహిళా కలెక్టర్ అన్న మాటలు. “చుప్ రహో. గల్తీ ఆప్ లోగోంకీ హై. కమీషన్ ఖోరీకీ భీ హద్ హోతీ హై.. జైలుకు పంపిస్తా జాగ్రత్త…. ఇది ప్రజాధనం.. నీ ఇంటి సొమ్ము కాదు” అంటూ కనీస నైతిక విలువలు కూడా లేవా? అని రోడ్డు మీదే ప్రశ్నించిన ఒక డైనమిక్ ఐఏఎస్ చంద్రకళ కాంట్రాక్టర్ ల మీద విరుచుకుపడ్డ దృశ్యాలను టీవీల్లో చూసిన దేశం మొత్తం ఆమె గట్స్ కి సలాం చేసింది. ఇలాంటి ఒక్క కలెక్టర్ మా జిల్లాకూ ఉంటే బావుండు అని కోరుకోని సామాన్యుడు లేడు. అటువంటి కలెక్టర్ని చూసి దేశం పొంగిపోతే తెలుగు వాళ్ళు గా మనం గర్వపడాలి. ఎందుకంటే చంద్రకళ మన తెలుగమ్మాయి. తెలంగణా రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లా గోదావరిఖని టౌన్ కి చెందిన ఒక ఎస్టీ మహిళ. దేశం మొత్తం గర్వించే స్థాయికి ఏలా చేరుకుందీ అంటే..


చంద్రకళ కరీంనగర్ జిల్లా.. ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లి కి చెందినా లక్ష్మీ, కిషన్ నాయక్‌ల కుమార్తె. ఉధ్యోగ రీత్యా ఈమె తండ్రి కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనికి వచ్చారు, తండ్రి రామగుండం ఎరువుల కర్మాగారం (ఎఫ్‌సీఐ)లో పనిచేసేవాడు. చంద్రకళకు చిన్నతనం నుంచే బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరిక. అందుకే ఇక్కడి కేంద్రీయ విద్యాలయంలో ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. తర్వాత కామర్స్, సైన్స్ అంటే ఇష్టమైనప్పటికీ ఇంటర్‌లో యావరేజ్ మార్కులే రావడంతో ఆ గ్రూపుల్లో సీటు సంపాదించ లేకపోయింది. దీంతో హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏలో చేరింది. డిగ్రీ చేస్తున్న సమయంలోనే చదువంటే కసి, పట్టుదల పెరిగి బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో నిలబడాలనుకుంది. అయితే, అప్పుడున్న సామాజిక పరిస్థితుల కారణంగా ఆమె డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో ఉండగానే అదే జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం గర్జనపల్లి తండాకు చెందిన రాములు నాయక్‌తో పెళ్లయింది. పెళ్లి చదువుకు ఇబ్బంది కల్గించినా భర్త సహకారంతో ముందుకు వెళ్లింది. భర్త రాములు ఎస్‌ఆర్‌ఎస్‌పీలో ఉద్యోగి. పై చదువులకు భర్త సహకరించడంతో డిగ్రీ పూర్తి చేసింది చంద్రకళ.

తనకి తొలుత గ్రూపు వన్ అధికారిణిగా హైదరాబాద్‌లోని సహకార సంఘం హెడ్ ఆఫీస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా.. తను ఇంకా ఏదో సాధించాలనే పట్టుదలతో ఉండేది. తను ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లాలి… తనలాంటి సామాన్య ప్రజలకు మంచి పాలన అందించాలని కలలు కనేది. అదే సంకల్పంతో చేస్తున్న ఉద్యోగానికి సంవత్సర కాలంపాటు సెలవు పెట్టి సివిల్స్‌కు ఫ్రిపేరయింది. ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్‌తో 2008లో సివిల్స్‌కి ఎంపికైంది. ట్రైనింగ్ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ జిల్లా పురాన్‌పూర్ ట్రైనీ ఆర్డివోగా బాధ్యతలు స్వీకరించింది. ఆ తర్వాత 2011లో అలహాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా.. 2012లో హమీద్‌పూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసింది. తరువాత మథుర కలెక్టర్‌గా పని చేశారు. మథురలో ఉన్నప్పుడే ఆమె ధాటికి తట్టుకోలేని అవినీతి అధికరులూ,కాంట్రాక్టర్లు అంత వణికిపోయేవారు.

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్ జిల్లా మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి బి చంద్రకళ నీతి, నిజాయితీలతో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అవినీతి, అక్రమార్కులకు పాల్పడే అధికారులు, కాంట్రాక్టర్లపై ఉక్కుపాదం మోపుతూ నిజాయితీకి మారుపేరుగా నిలుస్తున్నారు. రహదారి పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లను స్కూల్ పిల్లల్లా వరుసలో నిలబెట్టి మరీ క్లాస్ తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో ఇప్పటి వరకూ 6లక్షల మంది వీక్షించారు. దీంతో ఆమె ఒక్కసారిగా జాతీయస్థాయి వార్తల్లో నిలిచారు. బుధవారం ఆమె బులంద్‌షహర్ జిల్లాలో పలు రహదారుల పనుల తీరును ఆమె పరిశీలించారు. నాసిరకంగా రోడ్ల పనులను చేపట్టినట్లు ఆమె ఈ సందర్భంగా గుర్తించారు. దీంతో జూనియర్ ఇంజినీర్లు, మున్సిపల్ అధికారులు, ఇతర సిబ్బందితోపాటు కాంట్రాక్టర్లపైనా ప్రజల సమక్షంలోనే ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై విచారణకు ఆదేశించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాక 17 కాంట్రాక్ట్‌లను రద్దు చేశారు. అంతే జాతీయ మీడియా ఈ సివంగి కి బ్రహ్మ రథం పట్టింది. దేశవ్యాప్తంగా చంద్రకళ ఐఏఎస్ అన్న పేరు మారు మోగిపోయింది. ఆడపిల్లలు విపరీతంగ వివక్షకు గురౌతున్న దేశాల్లో మనదేశమూ ఒకటి. ప్రతికూల పరిస్థితుల్లోనూ. చంద్రకళ తను కోరుకున్నది సాధించేందుకు ఎంతగానోకష్టపడింది. తన ఎదుగుదలకు కారణమైన దేశంలో అవినీతిని చూసి సహించలేకపోయింది. ఇప్పుడు చంద్రకళ మన రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది.

Must Read: మనం తినేది అన్నం కాదు విషం.

(Visited 10,111 times, 1 visits today)