Home / Inspiring Stories / ఉధ్యోగం కోసం ఫ్లిప్ కార్ట్ లో తనని తాను అమ్మకానికి పెట్టుకున్నాడు.

ఉధ్యోగం కోసం ఫ్లిప్ కార్ట్ లో తనని తాను అమ్మకానికి పెట్టుకున్నాడు.

Author:

This IIT-KGP Graduate Wanted A Job In Flipkart. So He ‘Put Himself Up For Sale On The Site’

ఈ రోజుల్లో సర్టిఫికెట్లకన్నా ముఖ్యమైనది తనని తాను ప్రమోట్ చేసుకోవటం. ఒక ఉధ్యోగి ఎన్ని డిగ్రీలు చదివాడూ,ఏ యూనివర్సిటీ నుంచి వచ్చాడు అనే దానికన్నా అతనిలో ఉన్న ప్రమోటింగ్ కాలిబర్ నే ముందుగా పరిగణలోకి తీసుకుంటున్నారు కార్పోరేట్ గురువులు. సరిగ్గా అలాంటి పాయింట్ నే పట్టుకొని ఒక్కరోజులోనే పాపులర్ అయ్యాడు ఈ ఐఐటియన్. ఖరగ్ పూర్ ఐఐటీ లో చదువు పూర్తి చేసుకున్న ఆకాశ్ నీరజ్ మిట్టల్ కి ఆన్ లైన్ వ్యాపార ధిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగం చేయాలన్నది ఒక కల. అయితే అతను మామూలుగా ఉధ్యోగానికి అందరూ అనుసరించే పద్దతికన్నా భిన్నంగా ఆలోచించాడు. ఆన్ లైన్ అమ్మకాలకి ప్రసిద్దిపొందిన సైట్ లో ఉధ్యోగం కావాలంటే అదే పద్దతిలో ట్రై చేయలనుకున్నాడు. అయితే ఆ ప్రయత్నం లో ఇంకా ఫ్లిప్ కార్ట్ లో ఉధ్యోగమైతే రాలేదు గానీ దేశ వ్యాప్తంగా ఒకే రోజులో అతనొక హాట్ టాపిక్ అయ్యాడు,ఆన్ లైన్ లో వైరల్ న్యూస్ అయ్యాడు.. ఇంతకీ అతనేం చేసాడూ అనేకదా మీ అనుమానం..

అది ఆమె తప్పు కాదు(ఇట్ వస్ నాట్ హర్ ఫాల్ట్) అనే పుస్తకాన్ని కూడా రాసిన ఆకాశ్ తనకు ఫ్లిప్ కార్ట్ లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేయాలనుందంటూ, కావలసిన ఉధ్యోగం కోసం ఫ్లిప్ కార్ట్ లో తనకి తానే అమ్మకానికి పెట్టుకున్నట్టు ఒక ప్రకటన రూపం లో ఉన్న తన రెజ్యూమ్ ని పొస్ట్ చేసాడు. ఆతర్వాత తన అనుభవాన్ని నెట్ లో పంచుకుంటూ.. “మీకు ఒక పెద్ద కంపెనీలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ లాంటి 6అంకెల జీతం తో పాటు,మీరు ఒక విభిన్న ఆలోచన కలవారనే గుర్తింపు రావాలీ అంటే అందరికన్నా భిన్నంగా ఆలోచించాలి,మిగిలిన వారికంటే కొత్తగా ఆలోచించగలగాలి అప్పుడే మనకంటూ ఒక బ్రాండ్ ఏర్పడుతుంది. నేను చేసిన ఈ పని వల్ల ఫ్లిప్ కార్ట్ నుంచి నాకు కాల్ లెటర్ రాలేదు కానీ ఈ పని వల్ల నేను కొందరి మొహాల మీదకి నవ్వుని తెప్పించాను” అంటూ పోస్ట్ చేసాడు.

తనని తాను అమ్మకపు వస్తువుగా చూపించుకుంటూ. ప్రోడక్ట్ డీటెయిల్స్ అంటూ.. ప్రోడక్ట్ ఐడీ గా తన ఆధార్ కార్డ్ నంబర్ నీ, ప్రోడక్ట్ లాంచ్ డేట్ గా తన పుట్టిన తేదీనీ వేస్తూ ఆ రెజ్యూమ్ ని చూస్తున్నంత సేపూ, నవ్వుకునే విధంగానూ. ఈ పోటీ ప్రపంచం లో మనలని మనం ప్రమోట్ చేసుకోవటం లో ఎంత క్రియేటివ్ గా ఆలోచించవలసి వస్తుందో చెప్పాడు… ఒక్క సారి మనోడి నిర్వాకాన్ని మీరూ చూడండి…

This IIT-KGP Graduate Wanted A Job In Flipkart. So He ‘Put Himself Up For Sale On The Site’

Also Read: బాహుబలి-2 రీలీజ్ డేట్ వచ్చేసింది!

(Visited 4,494 times, 1 visits today)