Home / health / కీళ్ళనొప్పులని తగ్గించుకోవటానికి అధ్బుతమైన చిట్కాలు.

కీళ్ళనొప్పులని తగ్గించుకోవటానికి అధ్బుతమైన చిట్కాలు.

Author:

ప్రస్తుత కాలములో మన ఆహారపు అలవాట్ల వలనైతేనేమి, మన ఆహారములో మనకు తెలియకుండా పైరు నారు దశనుండే వివిధరకాలైన క్రిమి సంహారక మందులు వాడుటవలన తెలియకుండానే వాటి నుండి అనేక రుగ్మతలు మనకు సంప్రాప్తిస్తున్నాయి. అందులో ముఖ్యముగా చిన్నవయసు నుండి ముసలి వారి వరకు అందరినీ బాధిస్తున్న సమస్య కీళ్ళనొప్పులు. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని మార్గాలను తెలుసుకుందాం.

tips-to-to-reduce-joint-pains

  • నువ్వులనూనెలో వెల్లుల్లిపాయలు వేయించి పరిగడుపున ఒకటి లేక రెండు తిన్నట్లైతే కీళ్ళనొప్పులు, ఇతర నొప్పులు తగ్గుతాయి.
  • వాతపు నొప్పులకు శొంఠి , కరక్కాయ పొడిని ఒక స్పూను మోతాడులో రోజుకు రెండుసార్లు తీసుకుంటే తగ్గుతాయి.
  • నడుము నొప్పికి ఆముదపుగింజలు పొట్టుతీసి నూరి పాలతో కలిపి కాచి వడగట్టి రాత్రి తీసుకోవాలి.
  • శొంఠిని వేడిచేసి ఒక గ్రాము మోతాదులో నేతిలో కలిపి భోజన సమనములో తింటే కీళ్ళనొప్పులు పోతాయి.
  • ఆముదపు పప్పు, శొంఠి, పంచదార సమానంగా కలిపి రోజు ఒక చెంచాడు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
  • నువ్వులనూనె, నిమ్మరసము సమానముగా తీసుకుని బాగా చిలికి పైపూతగా వాడి, వేడి నీటితో కాపడం పెట్టిన కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

ఇంకా చాలకాలము నుండి  కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారు పైన చెప్పిన చిట్కాలతోపాటు యోగా మరియు కొన్ని రకములైన ఆసనములతో దూరము చేసుకొనవచ్చును. ఏది ఏమైనా యోగా మరియు యోగాసనములు తెలిసిన గురువుల సమక్షములో మాత్రమే చేయాలి. బజారులో దొరికిన పుస్తకములు కొనుక్కుని వాటి సహాయముతో యోగాసనములు చేయకూడదు. అటువంటి ఆలోచన ఉంటే విరమించుకుని మంచి గురువు సమక్షములో చేయుట శ్రేయస్కరం.

Must Share:  Video: పసుపు పచ్చగా ఉన్న దంతాలను నిమిషాల్లో తెల్లగా మార్చుకోవచ్చు.

(Visited 8,112 times, 1 visits today)