Home / Inspiring Stories / ఇదేనా పద్దతి?: మాజీ మంత్రి రేణుకా చౌదరి పై విరుచుకుపడ్డ నెటిజన్లు.

ఇదేనా పద్దతి?: మాజీ మంత్రి రేణుకా చౌదరి పై విరుచుకుపడ్డ నెటిజన్లు.

Author:

సమాజం లో ఒక స్థాయి లో ఉన్న సెలబ్రిటీలు తాము చేసే పనులు కూడా అదే స్థాయిలో ఉండాల్సి ఉంటుంది. నిత్యం ప్రజలు తమని గమనిస్తూనే ఉంటారన్నది మర్చిపోకూడదు. లేదంటే అభాసుపాలు కావాల్సి వస్తుంది. నిత్యం జనానికి నీతులు చెప్పే ప్రజా ప్రతినిదులు మరింత భాద్యతగ ఉండాలి. తాము ఇతరులకు చెప్పేముందు ఎంతవరకూ ఈ ప్రజా స్వామ్యాన్నీ, మానవీయ విలువలనూ పాటిస్తున్నామో చూసుకోవాలి. కనీసం మనిషికిచ్చే గౌరవాన్ని మర్చిపోతే ఇదిగో ఇలా మన మాజీ మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి రేణుకా చౌదరిలా అపఖ్యాతి మూటకట్టుకోక తప్పదు. ఇంతకీ ఏం జరిగిందంటారా….

కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి రేణుకాచౌదరీపై  తన కుటుంబంతో కలిసి ఓ ఫ్యామిలీ రెస్టారెంటుకు వెళ్ళారు. తమతోపాటు తమ ఇంట్లోని ఓ చిన్నపాపను చూసుకునే అమ్మాయిని కూడా తీసుకు వెళ్ళారు. అయితే ఆ అమ్మాయికి  కనీసం విలువ ఇవ్వకుండా వారంతా భోజనం చేశారు. కనీసం ఆ అమ్మయికి భోజనం పెట్టించకున్నా ఆ అమ్మాయిని కుర్చీలో కూర్చో అని కూడా చెప్పకుండా తమ భోజనం అయ్యే వరకూ అలాగే నిలబెట్టే ఉంచారు.

అయితే ఈ సంఘటనను చూసి చలించిన “రిషిబగ్రీ” అనే వ్యక్తి ఈ దృశ్యాన్ని ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేయటం తో దుమారం రేగింది. ఈ ఫొటోను ఒకే రోజు 1700మంది రీ ట్వీట్ చేశారు. ఒక అమ్మాయిని గంటల తరబడి అలాగే చేతులు కట్టుకుని నిల్చునేలా చేసినందుకు ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమంలో పలువురు ఆమెను విమర్శించారు.

“ప్రియమైన రేణుకా చౌదరీగారూ.. మీ చిన్నారిని చూసుకునే అమ్మాయికి భోజనం పెట్టించలేనప్పుడు వారిని అసలు రెస్టారెంట్లకు తీసుకెళ్లకండి” అంటూఒకరు కామెంట్ చేస్తే.., “ఇప్పటికే పెద్ద వాళ్ల ఇళ్లలో వెలి కొనసాగుతుందని చెప్పడానికి ఈ దృశ్యం ఒక సజీవ సాక్ష్యం” అంటూ మరొకరు., మరికొందరైతే ఏకంగా రాజకీయాల్లోకి దిగిపోయి “ఇది కాంగ్రెస్ పార్టీ కల్చర్” అని కూడా విమర్శించారు. అంతేకాదు “కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పప్పుతో భోజనం చేస్తున్నప్పుడు రేణుకా ఇలాగే నిల్చుంటార”ని కూడా పేర్కొన్నారు. మరీ గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలో రేణుకాచౌదరి మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసి ఉండటంతో ఆ కోణంలో కూడా ఆమె విమర్శలను ఎదుర్కోక తప్పలేదు.ఇంకొంత మంది “ఒక్క ఫోటోని చూసి ఆ అమ్మాయికి భోజనం పెట్టలేదని ఎలా డిసైడ్ చేస్తారని, రేణుక చౌదరి గారు ఇంకా మెనూ కార్డు పట్టుకునే ఉంది ఇంకా భోజనం ఆర్డర్ ఇవ్వలేదని” ట్వీట్ చేసారు, “మన ఇంట్లో పని వాళ్ళకి కూడా మనం తిన్న తరువాతే భోజనం పెడతామని” ఇంకొకరు చెప్పుకొచ్చారు.

Must Read: అ..ఆ సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

(Visited 5,232 times, 1 visits today)