Home / Inspiring Stories / పండ్ల మీద లొల్లివెడుతున్న బిత్తిరి సత్తి…!

పండ్ల మీద లొల్లివెడుతున్న బిత్తిరి సత్తి…!

ఎర్రెర్రని యాపిల్ నోరూరిస్తుంది,పచ్చగా బంగారపు ముద్దలా ఉండే మామిడి పండు నోట్లో వేసుకునే దాకా ఊర్కోనివ్వదు.కానీ మీరు పళ్ళతో బాటుగా ప్రాణాంతక రసాయణాలని కూడా తింటున్నారని మీకు తెలుసా.? ప్రమాదకరమైన కర్బైడ్ రసాయణం తో మాగ వేసిన పళ్ళతో మార్కెట్లని ముంచెత్తుతున్నారు వ్యాపారులు.. సపోటా, అరటి, మామిడి, బొప్పాయి ఇలా అన్ని రకాల పళ్ళనీ ఇలా రసాయణాలతో పండేలా చేసి అమ్ముతున్నారు, కంటికి నదురుగా కనిపిస్తే కానీ పళ్ళని కొనకుండా ఈ ప్రమాదకర రసాయనాల నే మనం తినేస్తూంటాం… ఇలా ప్రజా ఆరోగ్యం పై ప్రభావం చూపే పళ్లని అమ్మొద్దని హై కోర్ట్ తీర్పు చెప్పింది.. ఐతే ఆ హైకోర్ట్ మాటలనే ప్రచారం చేస్తున్నాడు మనసత్తన్న అదే బిత్తిరి సత్తన్న… హైకోర్ట్ మాటలని ఒక ప్లకార్డు మీద తన “భాష” “యాగవెట్టిన”,”పుండ్లు” అని రాసుకొని అందరికీ చెపుతూ రోడ్లమీద తిరుగుతున్నాడు. టీవీ న్యూస్ రీడర్ల కూ ఈ విశయం చెప్పమనీ చెప్తున్నాడు కూడ.ఐనా ఇంతమంచి పని చేసేటోడు బిత్తిరి సత్తి ఎలా అవుతాడు?  సూపర్ సత్తన్న సావిత్రక్కకు కూడా ఇంకోసారి గట్టి గాచెప్పు… కార్బైడ్ లో మాగ బెట్టిన పళ్ళని తినొద్దు అని….

Must Read:నరేంద్ర మోడీకి లేఖ రాసిన 8 ఏళ్ళ కుర్రాడు.

(Visited 161 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]