Home / Inspiring Stories / ఆంజనేయుని కంటి నుంచి నీరు…ఆందోళనలో భక్తులు.

ఆంజనేయుని కంటి నుంచి నీరు…ఆందోళనలో భక్తులు.

Author:

ఖమ్మం జిల్లాలోని వైరా మండలం బ్రాహ్మణపల్లి అగ్రహారంలో వింత ఘటన చోటు చేసుకుంది. అగ్రహారంలో ఉన్న అభయాంజనేయస్వామి ఆలయంలో ఆంజనేయుని విగ్రహం కంట్లో నుంచి నీటి ధార ప్రవహిస్తోంది. ఆలయ పాలకవర్గం గడువు ముగియడంతో అర్చకులు నిన్న గుడిని మూసివేశారు. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంని శుద్ధి చేయడానికి అర్చకులు ఆలయాన్ని ఈరోజు ఉదయం తెరువగా గర్భగుడిలో ఉన్న స్వామి వారి విగ్రహం కంటి నుంచి నీటి ధార కారుతూ కనిపించింది. ఈ విషయాన్ని ఆలయ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన గ్రామస్థులు వింతను చూసేందుకు తరలివస్తున్నారు. స్వామి కంట నుంచి నీరు రావడంపై భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. చుట్ట పక్కల గ్రామస్తులు కూడా ఈ వింతని చూడడానికి వస్తున్నారు. భక్తులలో నెలకొన్న భయాందోళనలని తగ్గించేందుకు జ్ఞనవిజ్ఞాన వేదిక వారు కూడా బ్రాహ్మణపల్లి అగ్రహారంనికి చేరుకున్నారు.

Water From Hanuman Idol in Khammam

Must Read: తిరుమలకి వెళ్ళే శ్రీవారి భక్తులకు శుభవార్త.

(Visited 3,047 times, 1 visits today)