Home / Latest Alajadi / వాట్సాప్ లో వీడియో కాలింగ్ ఆప్షన్ వచ్చేసింది.

వాట్సాప్ లో వీడియో కాలింగ్ ఆప్షన్ వచ్చేసింది.

Author:

వాట్సాప్ అప్లికేషన్ ని ఉపయోగించే వారు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఆప్షన్ వచ్చేసింది, ఇప్పటికే ఎన్నో ఉపయోగకరమైన ఆప్షన్స్తో ఎక్కువమందికి చేరువైన వాట్సాప్ ఇప్పుడు వీడియో కాలింగ్ ఆప్షన్ తో మన ముందుకు వచ్చింది.

whatsapp-video-calling-option

కొన్ని నెలల కిందట ఆడియోకాల్ ఆప్షన్ ని ప్రవేశపెట్టిన వాట్సాప్ ఇప్పుడు వీడియో కాలింగ్ సౌకర్యం కూడా ఇవ్వడంతో వాట్సాప్ వినియోగదారులు ఆనందపడిపోతున్నారు, ప్రస్తుతానికి ఈ ఆప్షన్ కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది, అది కూడా వాట్సాప్ వర్షన్ బీటా 2.16.316 ఆ తరవాత వచ్చిన వర్షన్ వాట్సప్ వాడుతున్న వారికీ మాత్రమే వీడియో కాలింగ్ సౌకర్యం ఉంటుంది, మీరు వీడియో కాల్‌ చేసుకోవాలంటే కచ్చితంగా అవతలివారు కూడా ఈ వర్షన్లకు అప్‌డేట్‌ అయి ఉంటేనే సాధ్యమవుతుంది. అటువంటి కాంటాక్ట్స్‌కి కాల్‌ క్లిక్‌ చేయగానే వీడియో లేదా వాయిస్‌ కాల్‌ అని అడుగుతుంది. నచ్చినది ఎంచుకోవచ్చు.. ప్రస్తుత వాట్సప్‌ కాల్‌లాగే ఎవరు అప్‌డేట్‌ చేసుకున్నారో చెక్‌ చేయొచ్చు.. ఆయా కాంటాక్ట్‌ల పక్కన వీడియో, ఆడియో సింబల్స్‌ కనిపిస్తాయి.. కాల్‌ పూర్తయిన తరవాత క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకునేందుకు యాప్‌ రేటింగ్‌, ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటుంది.

బీటా వర్షన్‌ పొందాలంటే ఇలా చేయండి:

రెగ్యులర్‌ వర్షన్‌ వాడేవాళ్లు బీటావర్షన్‌ ఎనేబుల్‌ చేసుకోవాలి.. వాట్సప్‌ ప్రతిఅప్‌డేట్‌ను ప్లేస్టోర్‌ నుంచేచేసుకోవొచ్చు… ఈ షార్ట్‌లింక్‌ https://goo.gl/zTkbdH ద్వారా ప్లేస్టోర్‌లో బీటావర్షన్‌ అనేబుల్‌కు ఓకే చేసుకోవొచ్చు… లేదంటే ఏపీకే మిర్రర్‌ వంటి వెబ్‌సైట్ల ద్వారా బీటా వర్షన్‌ 2.16.316 లేదా 2.16.318 వర్షన్లు నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవొచ్చు… అలా చేసుకున్న యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునే సమయంలో సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో అన్‌నౌన్‌ సోర్స్‌ అనేచోట క్లిక్‌ చేస్తేనే ఆండ్రాయిడ్‌ మొబైల్‌‌లో ఇన్‌స్టాల్‌ చేసేందుకు అనుమతి ఇస్తుంది… ఈ షార్ట్‌ లింక్‌, https://goo.gl/8u06op? ద్వారా ఏపీకే మిర్రర్‌ సైట్‌ నుంచి నేరుగా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవొచ్చు.

Must Read: ఈ దేశాలకి వెళ్ళడానికి భారతీయులకి వీసా అక్కర్లేదు.

(Visited 7,906 times, 1 visits today)