Home / Political / భారతీయులు ఫాటించే మూఢనమ్మకాల వెనకున్న రహస్యాలు

భారతీయులు ఫాటించే మూఢనమ్మకాల వెనకున్న రహస్యాలు

Author:

మన పూర్వికులు మనకు చాలా ఆచారాలతో పాటు మూఢనమ్మకాలు కూడా అలవాటు చేశారు. మంగళవారం నాడు కటింగ్ క్షవరం చేసుకోవద్దు, పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు, చీకటి పడ్డాక గోళ్లు కత్తిరించుకోవటం కానీ, ఇల్లు ఊడ్చడం కానీ చేయవద్దని అంటారు. వీటిని మూఢనమ్మకాలు అని మనం ఎందుకు అనుకుంటాం అంటే…. వారు చెప్పేవాటికి పెద్దవాళ్ళు కచ్చితమైన జవాబు మనకు ఇవ్వలేరు సరి కదా అది అంతే ఆలా చేయకూడదు అని చెప్తుంటారు. కానీ కొన్ని మూఢ నమ్మకాల వెనక కూడా సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా…?

3b8327fdc67641c3d5ddb0c18c42d9eb2a6ce323e9bdf8181apimgpsh_fullsize_distr

మంగళవారం రోజున కటింగ్ ఎందుకు చేయించుకోకూడదు
క్షవరం చేసుకోవటానికి రోజులు, వారాలు, తిధులతో సంబంధం లేదు కానీ, మంగళి వృత్తి చేసే వారికి సెలవు ఇవ్వడానికి పుట్టిందే ఆ ఆచారం. గతంలో ప్రతి సోమవారం సెలవు ఉండేదట. అందుకని చాలా మంది సోమవారం క్షవరం చేయించుకునేవాళ్లట. మంగళి వారికి కూడా వారంలో ఓ రోజు సెలవుండాలి కాబట్టి, అందులోనూ సోమవారం పని ఎక్కువగా చేసి బాగా అలసిపోతారు కాబట్టి, మరుసటి రోజైన మంగళ వారం హాయిగా విశ్రాంతి తీసుకుంటే మంచిదని మంగలి వృత్తి వారు నిర్ణయించుకున్నారు. అలా మొదలైన ఆచారం వలన మంగళవారం కటింగ్ చేయించుకోవొద్దని అంటారు.

ఇంట్లో గొడుగులు తెరవటం మంచిది కాదు
ఇంట్లో గొడుగు తెరవటం వలన దాని ముందున్న ఇనుప కడ్డీ ఇతరుల కంట్లో కుచ్చుకుంటుందని, ఇంట్లో గొడుగు హఠాత్తుగా తెరవటం వలన దానికి దగ్గరలో ఉన్న వస్తువులకు తగలడంతో కిందపడిపోతాయి. అందుకే గొడుగు ఇంట్లో ఓపెన్ చేయవద్దని చెబుతారు. అలా చెబితే పెద్దగా పట్టించుకోరని ఇంట్లో గొడుగు ఓపెన్ చేస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందని ట్యాగ్ లైన్ తగిలించారు.

షాపుల ముందు, ఇంటి ముందు, వాహనాలకు నిమ్మకాయ, పచ్చి మిర్చి, పండుమిర్చి కలగలిపి వేలాడదీసి ఉంచడం
ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు, అరిష్టాలు జరగవని, ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుందని చెబుతారు. కానీ, కారణం అదికాదు. సైన్స్ ప్రకారం ఇలా వాటిని వేలాడదీయడం వలన ఇంట్లోకి క్రిమికీటకాలు, దోమలు, దుర్వాసన రాకుండా అరికడతాయని కట్టేవాళ్ళట.

పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు
ఇంట్లో పగిలిన అద్దాలను బయటపడేయమని చెబుతారు. పగిలిన అద్దాలలో శరీరాన్ని చూసుకోకూడదని హెచ్చరిస్తారు. దీనికి ఓ కారణం ఉంది. పూర్వం అద్దాలు ఎక్కువ ధరకు అమ్మేవారు. అవి కూడా నాసిరకంగా ఉండేవి. పగిలితే కొత్తది కొనడం కష్టమని, అద్దం చూసుకునేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండటానికి ఇలాంటివి చెప్పేవారట.

చీకటి పడ్డాక గోళ్ళు కత్తించుకోకూడదు
చీకటి పడ్డాక గోళ్ళుకట్ చేసుకోకూడదని చెబుతుంటారు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ ఎక్కువగా నమ్ముతారు. కారణం లేకపోలేదు. సూర్యాస్తమయం తర్వాత గోళ్ళు కత్తిరించుకోవడం వలన గోళ్ళకు బదులుగా ఎక్కడ చిగుళ్ళు కట్ చేసుకుంటారేమో అలా నమ్మకం సృష్టించారు.

బల్లి మీద పడితే దోషమా? అదృష్టమా?

చీకటి పడ్డాక ఇళ్ళు ఊడవొద్దు
సాయంత్రం దాటాక చీకటిపడ్డప్పుడు చీపురు ఊడుస్తుంటే చీపురు పట్టుకోవద్దని చెప్పేవారు. చీకటి పడ్డ తర్వాత చీపురుపడితే ఏదో జరుగుతుందన్న భయం క్రియేట్ చేశారు. పూర్వం సాయంత్రం తర్వాత చీకటి పడగానే చీపురు ముట్టుకోవద్దని ఎందుకు చెప్పేవారంటే తమకు తెలియకుండా కిందపడ్డ నగ,నట్ర చీపురుతో శుభ్రం చేసేటప్పుడు వాటితోపాటు కనిపించకుండా పోతాయని అలా చేసేవారు.

గ్రహణం సమయంలో గర్బిణీలు బయటికి రావొద్దు
గ్రహణం సమయంలో గర్భిణీలను బయటకు రావొద్దని, కూరగాయలు కోయటం చేయవద్దని చెబుతారు. ఎందుకంటే గ్రహణం సమయంలో గర్భిణీగా ఉన్న వారి పొట్టపై యూవీ కిరణాలు పడి బిడ్డకు హాని జరుగుతుందని ఒక నిబంధన ఉంది.

(Visited 3,909 times, 1 visits today)