Home / health / ఈ ట్రిక్ తో దోమలని తరిమికొట్టొచ్చు..!

ఈ ట్రిక్ తో దోమలని తరిమికొట్టొచ్చు..!

Author:

వర్షాకాలం మొదలైంది అని ఆనందపడేలోపే దోమలు ఇంట్లోకి వచ్చేసి నిద్ర పట్టకుండా చేస్తాయి, ఇంటి చుట్టూపక్కల ఎక్కువగా చెట్లు, మురికి గుంటలు ఉంటే ఇక అంతే సంగతులు దోమలతో జాగారం చెయ్యవలసిందే, దోమలని చంపడానికి ఆల్ ఔట్ లని, మస్కిటో కాయిల్ లని వాడుతాం కాని అవి దోమలనీ ఏం చేయలేవు, వాటికి దోమలు ఎప్పుడో అలవాటు పడిపోయాయి, ఇంకా మస్కిటో కాయిల్స్ తో మన ఆరోగ్యానికి కూడా హాని జరిగే అవకాశం ఉంది, కాని ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాతో దోమలనీ చాలా సులభంగా తరిమికొట్టవచ్చు, ఈ ప్రయోగం వల్ల ఎటువంటి  సైడ్ ఎఫక్ట్స్ రావు, దీనిని ఎలా చెయ్యాలో తెలుసుకోండి.

with-this-trick-we-can-kill-mosquitos

    • ముందుగా ఒక రెండు లీటర్ల వాటర్ బాటిల్ ని తీసుకొని ముందుగా దాని రెండు భాగాలుగా కత్తిరించాలి.
    •  కొద్దిగా నీటిని తీసుకొని వాటిని వేడి చేసి చల్లార్చి పక్కన పెట్టాలి.
    • చల్లార్చిన నీటిలో కొద్దిగా చక్కర,ఈస్ట్ (ఇది మన కిరాణా షాప్ లలో దొరుకుతుంది లేదంటే ఆన్ లైన్ లో Yeast కొనవచ్చు) వేసి భాగా కలపాలి.
    • మనం ముందు కత్తిరించిన బాటిల్ రెండవ భాగాని రివర్స్ లో పెట్టి రెండు భాగాలు కలిసే చోటా కొద్దిగా గమ్ కానీ లేదా గమ్ టేప్ అంటిచాలి.
    •  ఆ తర్వాత ఏదైనా ఒక ప్లేస్ లో బాటిల్ ని పెట్టేయాలి.
    • మెల్లిగా ఇప్పుడు  ఆ బాటిల్ లోని  నీటి నుండి కార్బన్ డై ఆక్సైడ్ విడులవడం ప్రారంభం  అవుతుంది.
    • మెల్లిగా ఈ కార్బన్ డై ఆక్సైడ్ దోమలను ఆకర్షించడంతో ….. దోమలు ఈ బాటిలోకి వచ్చి చచ్చిపోతాయి.

ఈ విధంగా చేసుకుంటే మీ ఇంట్లోకి దోమలు అనేవి రాకుండ చేసుకోవచ్చు …. కావలంటే ఒక్కసారి మీరు ఈ ప్రయోగం చేసి చూడండి…!

Must Read:Video: ఆగ్గిపెట్టె అవసరం లేకుండా ఆగ్గిపుల్లని వెలిగించే చిట్కా.

(Visited 20,547 times, 1 visits today)