Home / Inspiring Stories / మొట్ట మొదటి హిజ్రా ఎస్సై ప్రితికా యాషిని.

మొట్ట మొదటి హిజ్రా ఎస్సై ప్రితికా యాషిని.

Author:

hijra as Police in Tamil nadu

ఆడా మగాలతో సమాన హక్కులు పొందటానికి కొన్ని ఏళ్ళుగా హిజ్రాలు సాగిస్తున్న పోరాట ఫలితాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. శారీరక లోపంగా కాక హిజ్రాలని కూడా ఒక ప్రత్యే జాతిగా గుర్తించేందుకు ప్రజలూ ఇప్పుడు ఇదివరకులా వివక్షతో దూరం జరగటం లేదు. ప్రధాన పట్టణాలలో అధిక సంఖ్యలో ఉండే వీరిపై ఎవరూ ఆలోచించనంత ఉన్నతంగా ఆలోచించి వారి కంటూ ఉండే ఒక అస్తిత్వాన్ని గుర్తించిన మొదటి రాష్ట్రం బెంగాల్. ఇది వరకే మనభీ బందోపాధ్యాయ అనే ఒక హిజ్రాని ఒక కాలేజీ కి ప్రిన్సిపల్ గా చేసిన బెంగాల్ మానవాభివృద్ది వనరుల శాఖ ఒక విప్లవాత్మకమైన నిర్ణయాని తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. భారత్ లాంటి దేశాల్లో ఇటువంటి పరిణామం మామూలుదేం కాదు. ఈ ఘటనతో దేశవ్యాప్త హిజ్రాలలో ఆత్మ విశ్వాసం పెరిగింది. మిగిలిన పౌరులలో కూడా వారంటే ఉన్న వ్యతిరేఖ భావన కూడా కొంత వరకూ తగ్గిపోయి హిజ్రాలకూ చదువుకోవటానికీ అవకాశం ఏర్పడింది… అదే బాటలో ఈ సారి బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంకా ఆశ్చర్య కరం అయినా  అదీ అహ్వానించదగ్గదే. హిజ్రాలని Civic Police Volunteer Force (CPVC) లోకి తీసుకొని.. వారి ద్వారా నైట్ డ్యూటీలు చేసే మహిళా ఉధ్యోగులకూ, రైల్వే స్టేషన్ ల దగ్గర వచ్చే మహిళలకూ రక్షణ కోసమూ ఇంకా ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకుంటారట. వీరిని గ్రీన్ పోలీసులుగా వ్యవహరిస్తారు. పశ్చిమ బెంగాల్ స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి అయిన శ్రీమతి శశి పంజా బెంగాల్ హిజ్రా డెవలప్ మెంట్ బోర్డ్ వారి మీటింగ్ లో ఈ విషయాన్ని ప్రతిపాదించారు.

అదే దారిలో ఇప్పుడు చెన్నై లోని ప్రితికా యాషిని అనే ఒక హిజ్రా పోలీస్ ఎస్సై గా ఉధ్యోగం సంపాదించిందింది. ఐతే దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు లో ఆమెకి అంత సులభంగా సాధ్యం అయిందేం కాదు. ఆమె తన ఉధ్యోగం కోసం పోరాటమే చేయల్సి వచ్చింది.ఈ ఉద్యోగం కోసం ఆమె గత కొన్ని రోజులుగా తమిళనాడు యూనిఫామ్‌ సేవల నియామక మండలి పైన పోరాటం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ సంస్థ ఎస్సై నియామకాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది.దీనికి 1.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష, ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్, వైవా వాయిస్ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రీతిక ఒక్కరే ట్రాన్స్ జెండర్. ఆ కారణం తోనే ప్రితికా చేసుకున్న దరఖాస్తును ఆ సంస్థ తిరస్కరించింది. దాంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చింది.దీంతో ప్రీతిక పరీక్షలు రాశారు.

ఇప్పుడు పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి ప్రితికా అర్హురాలేనని స్పష్టం చేసింది…అయితే ప్రీతిక ఉధ్యోగంలో చేరినా ఆమె పై వివక్ష తగ్గకపోవచ్చు.. విధి నిర్వహణలో ఆమె అవమానాలను ఎదుర్కోవాల్సి రావొచ్చు కూడా. అయినా ప్రితికా ఇప్పుడొక వెలుగు దివ్వె. తన జాతి మనుషులందరికీ ఒక ఆదర్శం. ట్రాస్జెందర్ అనేది ఒక శాపగ్రస్త జన్మ అనే భావం తగ్గటానికి ప్రీతికా ఒక మొదటి మెట్టు.

Must Read: 111 రోజులలో బెంగళూరు నుండి ప్యారిస్ కి కారులో ప్రయాణం చేశారు.

(Visited 1,572 times, 1 visits today)